హైదరాబాద్, 26 జూలై (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు డిఎస్పి లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతిచెందిన వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన డీఎస్పీలు మేక చక్రధర్ రావు, కాంతారావుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకున్నది.. వేగంగా వెళ్తున్న లారీ.. ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ..ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న డీఎస్పీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే కారుడ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీకి చెందిన పోలీస్అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ..ప్రమాదం చోటుచేసుకుంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..