హైదరాబాద్, 26 జూలై (హి.స.)
మెరుగైన వైద్య సౌకర్యాలు
అందించడమే హాస్పిటాలిటీ లక్ష్యమని, నిరుపేదల కోసం తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయం అందించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ లోని జెడే స్పెశాలిటీ హాస్పిటల్స్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార దృక్పధంతో కాకుండా సేవా దృక్పధంతో పనిచేసినపుడే ప్రజల మన్ననలు పొందుతారన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అన్ని విభాగాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ఘర్షించదగ్గ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిహెచ్ మాల్లారెడ్డి, ఎమ్యెల్యే కెపి వివేకానంద, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె. హన్మంత్ రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..