హైదరాబాద్, 26 జూలై (హి.స.)
30 సంవత్సరాల క్రితం తెలుగు
నేల మీద తూర్పున ఉదయించిన ఉద్యమానికి మందకృష్ణ నేతృత్వం వహించారని, ఆయన దళితుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ లో మిత్రమండలి నాయకులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన మహాయోధుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి, అలాయ్ బలై కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన స్ఫూర్తిగా కన్నడ, మరాఠీ, ఉత్తరప్రదేశ్, తమిళ ప్రాంతాలలో ఇలా అనేక ప్రాంతాలకు ఇదే ఉద్యమం విస్తరించిందని, ఒక ఊరిలో ప్రారంభమైన ఉద్యమం తెలుగు నేలంతా సాధించిందన్నారు.15 పాకి ఉద్యమ ఫలాలను సంవత్సరాలపాటు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో తాను సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ గురించి అనేకసార్లు అడిగాను. జీరో అవర్లో కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చామని అన్నారు.
దివ్యాంగుల సమస్యలపై ఉద్యమం, గుండె జబ్బులు కలిగిన వారి సమస్యల పరిష్కారానికి చేసిన ఉద్యమంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని, ఈ పోరాటంలో తనపై తీవ్రమైన ఒత్తిడి ఉండేదని, ఈ సమస్య పరిష్కారం కోసం అనేక నిద్రలేని రాత్రులు గడిపానని, సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..