నస్రీకళం.జిల్లా ఇచ్ఛాపురం హెడ్న్పోసర్ట్ ఆఫీస్ లో. భారీ అవినీతి
ఇచ్ఛాపురం, 26 జూలై (హి.స.) , :శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం హెడ్‌ పోస్టాఫీసులో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఖాతాదారుల యూజర్‌ ఐడీలు ఉపయోగించి రూ.2.86కోట్లు దారి మళ్లించారు. ఈ నెల 7న ప్రజావినతుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోస్టల్‌ అధికారుల
నస్రీకళం.జిల్లా ఇచ్ఛాపురం హెడ్న్పోసర్ట్ ఆఫీస్ లో. భారీ అవినీతి


ఇచ్ఛాపురం, 26 జూలై (హి.స.)

, :శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం హెడ్‌ పోస్టాఫీసులో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఖాతాదారుల యూజర్‌ ఐడీలు ఉపయోగించి రూ.2.86కోట్లు దారి మళ్లించారు. ఈ నెల 7న ప్రజావినతుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోస్టల్‌ అధికారులు తనిఖీకి ఆదేశించారు. పోస్టల్‌ ప్రాంతీయ తనిఖీ అధికారులు ఎన్‌.శ్రీకాంత్‌, కమల్‌హాసన్‌ శుక్రవారం ఇచ్ఛాపురం వచ్చి, విచారణ జరిపారు. బాధితులతోనూ మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్ఛాపురం కేంద్రంగా తపాలశాఖలో భారీ అవినీతి జరిగింది. ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశాం. ఇచ్ఛాపురం హెడ్‌ పోస్టాఫీసులో 33మంది ఖాతాదారుల నుంచి రూ.2.86 కోట్లు మళ్లించినట్లు గుర్తించాం. ఇందులో 14 మంది సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించాం. ప్రస్తుతం ఐదుగురిని సస్పెండ్‌ చేశాము. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande