ఆంధ్రప్రదేశ్. లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
అమరావతి, 26 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటికే కీలక నేతల అరెస్ట్‌ వ్యవహారం కాకరేపుతుండగా.. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్ కోసం వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది సి
ఆంధ్రప్రదేశ్. లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం


అమరావతి, 26 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటికే కీలక నేతల అరెస్ట్‌ వ్యవహారం కాకరేపుతుండగా.. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్ కోసం వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది సిట్‌.. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయటం కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సిట్‌ అధికారులు..

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేసులో ఏ7గా ఉన్న అవినాష్ రెడ్డి, ఏ40 పురుషోత్తం, ఏ41 అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ ల అరెస్ట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. అయితే, సిట్‌ వారెంట్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.. మరోవైపు, ఇందులో 9 మంది నిందితులు దుబాయ్, థాయ్‌ల్యాండ్ లో ఉన్నట్టు ఇప్పటికే సిట్‌ గుర్తించింది.. ఇక, వారెంట్ కు కోర్టు అనుమతి ఇస్తే నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనుంది సిట్‌.. కేసులో ఏ7, ఏ9, ఏ10 సహా ఏ40 నుంచి ఏ48 వరకు ఉన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande