విజయవాడ, 24 జూలై (హి.స.)
: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం సారె మహోత్సవం గురువారంతో పరిసమాప్తమైంది. నేటి సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు, పరిచారకులు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. వీరికి ఆలయ ఈవో స్వాగతం పలికారు. అమ్మవారికి సుమారు రూ.4లక్షల విలువ చేసే ఆభరణాన్ని ఆలయ పండితుల తరఫున కానుకగా అందజేశారు. గత రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో కొండ రాళ్లు పడే అవకాశం ఉన్నందున ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలను నియంత్రించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ