హైదరాబాద్, 26 జూలై (హి.స.), : హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై సంస్థ రాయితీ ప్రకటించింది. ఛార్జీలపై 16 నుంచి 30 శాతం వరకు తగ్గించింది. విజయవాడ నుంచి గరుడ ప్లస్ బస్సు టికెట్ ధర రూ.635 నుంచి రూ.444కు, గరుడ క్లాస్ రూ.592 నుంచి రూ.438, రాజధాని ఏసీ రూ.533 నుంచి రూ.448, లగ్జరీ సూపర్ క్లాస్ ధరలను రూ.815 నుంచి రూ.685కి తగ్గించింది. బెంగళూరు మార్గంలో సూపర్‌లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.946 నుంచి రూ.757కి, లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ రూ.1569 నుంచి రూ.1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర రూ.1203 నుంచి రూ.903కి, బెర్త్ రూ.1569 నుంచి రూ.1177కి తగ్గించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు వర్తిస్తాయని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ