కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు మళ్లీ బయటపడ్డాయి.! డీ.కే అరుణ
హైదరాబాద్, 24 జూలై (హి.స.) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ -కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ''హైడ్ అండ్ సీక్'
డీకే అరుణ


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ -కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే 'హైడ్ అండ్ సీక్' రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారన్నారు. తనతో పాటు తన కుటుంబం ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాట్లాడారని.. కానీ, ఇప్పుడు ఆయన అవన్నీ మరిచినట్టుగా, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అనే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

అలాంటప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా..? లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా..? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరాయనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కేవలం మాటల యుద్ధం చేసుకుంటూ కుమ్ములాటలు చేసుకుంటూ, చీకట్లో ప్యాకేజీలు కుదుర్చుకుంటున్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande