పూజల పేరిట.గృహిణులకు టోకరా
అమరావతి, 24 జూలై (హి.స.) నూరేళ్లకోసారి వచ్చే అమావాస్య ఇది.. ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో శుభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చూసిన ఓ గృహిణి వాట్సప్‌ ద్వారా నిర్వాహకులను సంప్రదించింది. ఆమె నుంచి కుటుంబ వ
పూజల పేరిట.గృహిణులకు టోకరా


అమరావతి, 24 జూలై (హి.స.)

నూరేళ్లకోసారి వచ్చే అమావాస్య ఇది.. ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో శుభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చూసిన ఓ గృహిణి వాట్సప్‌ ద్వారా నిర్వాహకులను సంప్రదించింది. ఆమె నుంచి కుటుంబ వివరాలు సేకరించి, రిజిస్ట్రేషన్‌ తదితర పేర్లతో రూ.40వేలు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా స్పందన రాకపోవటంతో మోసపోయినట్లు ఆమె గ్రహించారు.

ఈ నాణెం మీ వద్ద ఉంటే అద్భుత శక్తులు సొంతం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో వీడియో చూసిన ప్రైవేటు ఉద్యోగి రూ.లక్ష చెల్లించాడు. విదేశాల నుంచి తెప్పించేందుకు అదనంగా రూ.25వేలు డిమాండ్‌ చేయటంతో ఇదంతా మాయగాళ్ల పనిగా గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande