దవాఖాన పరిసరాలలో స్వచ్ఛదనం- పచ్చదనం పాటించాలి.. హనుమకొండ జిల్లా వైద్యాధికారి
తెలంగాణ, హనుమకొండ. 24 జూలై (హి.స.) దవాఖాన పరిసరాలలో స్వచ్ఛదనం- పచ్చదనం పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ స
హనుమకొండ జిల్లా వైద్యాధికారి


తెలంగాణ, హనుమకొండ. 24 జూలై (హి.స.) దవాఖాన పరిసరాలలో స్వచ్ఛదనం- పచ్చదనం పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఫార్మసీ, డయాగ్నోస్టిక్ హబ్ కు పంపించే శాంపిల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపడుతున్న ఫీవర్ సర్వే, డ్రైడే కార్యక్రమ తీరును పరిశీలించారు.

గ్రామంలో దోమలు, ఈగలు రాకుండా, తగు చర్యలు చేపట్టాలని సూచించారు. జబ్బు వచ్చినంక బాధపడే కంటే రాకుండా ఉండేందుకు ముందే జాగ్రత్త వహించడం, పరిశుభ్రత పాటించడం చాలా మంచిదని తెలిపారు. అనంతరం హాస్పిటల్ పరిసరాలలో వ్యర్థ మొక్కలను సిబ్బంది తో కలిసి తొలగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande