రాజమహేంద్రవరం, 24 జూలై (హి.స.)
, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. రాజమహేంద్రవరంలో విద్యుత్ శాఖాధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే విద్యుత్ శాఖ సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ