అమరావతి, 24 జూలై (హి.స.)
అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి లక్ష 51 వేల క్యూసెక్కులు మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 8.90 అడుగులుగా నమోదు అయ్యింది. బ్యారేజ్ నుండి వ్యవసాయ అవసరాలకు తూర్పుడెల్టాకు 3800 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2100 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 4700 క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ధవలేశ్వరం వద్ద కూడా మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి జలాశయాలు కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే, భారీ వర్షాల కారణంగా నది పర్వాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ