హరిహర తెలుగు స్టేట్స్ 'ప్రీమియర్స్ షో' కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
హైదరాబాద్, 24 జూలై (హి.స.) హరిహర వీరమల్లు మొత్తానికి భారీ అంచనాల మధ్య, భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాగే ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూ
ఆల్ టైమ్ రికార్డ్..


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

హరిహర వీరమల్లు మొత్తానికి భారీ అంచనాల మధ్య, భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాగే ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఏపీలో భారిగా ప్రీమియర్స్ వేసారు. అయితే నైజాంలో పర్మిషన్ వచ్చిన కూడా డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్స్ కు మధ్య వచ్చిన ఇస్యూస్ కారణం కేవలం ప్రీమియర్స్ కు 5 గంటల ముందు మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేసారు.

ఓవరాల్ గా కాస్త ఆలస్యంగా ప్రీమియర్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినా కూడా అదరగొట్టింది హరిహర వీరమల్లు. ముఖ్యంగా నైజాంలో రూ.5.08కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రూ. 1,53,72,690 (షేర్)తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. వెస్ట్ గోదావరి లో రూ. 1.42 కోట్లు, కృష్ణ జిల్లా రూ.81 లక్షల (షేర్) రాబట్టింది. ఉత్తరాంధ్ర రూ. 2.32 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కు గాను అటు ఇటుగా రూ. 18 కోట్లు. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2 కోట్లు వసూలు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande