ఉత్తర బంగాళా ఖాతంలో అల్ప.పీడనం ఏర్పడింది
అమరావతి, 24 జూలై (హి.స.) అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వైపు కదిలే అవకాశం ఉందన
ఉత్తర బంగాళా ఖాతంలో అల్ప.పీడనం ఏర్పడింది


అమరావతి, 24 జూలై (హి.స.)

అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande