ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలి : కలెక్టర్ హరిచందన
హైదరాబాద్, 24 జూలై (హి.స.) ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనిక్, వ్యాయమ గదులను పరిశీలించి గర్భవతుల
కలెక్టర్ హరిచందన


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనిక్, వ్యాయమ గదులను పరిశీలించి గర్భవతులకు టీకాల తో పాటు, తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి, ఎమర్జెన్సీ వార్డును సందర్శించి సమయానికి మందులు, భోజనం అందుతున్నాయా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల పరిధిలో మెటర్నటీ క్యాంపులు చేపట్టి గర్భవతులకు ఆహార నియమాలు, వ్యాయామం పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జబ్బులతో వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు పరిసర ప్రాంతాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande