కొడుకు కేటీఆర్ కు కేసిఆర్ దంపతుల ఆశీర్వాదాలు
హైదరాబాద్, 24 జూలై (హి.స.) నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య, పిల్లలతోసహా గురువారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నివాసానికి చేరుక
కేటీఆర్


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య, పిల్లలతోసహా గురువారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నివాసానికి చేరుకున్న కేటీఆర్ ముందుగా తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రున్ని ఆలింగనం చేసుకున్న కేసీఆర్, కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande