తెలంగాణ, 24 జూలై (హి.స.)
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడు కల్వకుంట్ల తారకరామారావు అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. గురువారం కేటీఆర్ 49వ జన్మదినోత్సవం వేడుకలు వరంగల్ పోచం మైదానం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలు మహిళా నాయకులు కేటీఆర్ జన్మదినోత్సవం వేడుకల్లో పాల్గొనగా, మాజీ ఎమ్మెల్యే నరేందర్ కేక్ కట్ చేశారు. జై కేటీఆర్ జై కేసీఆర్ జై జై టిఆర్ఎస్ పార్టీ నినాదాలతో పోచం మైదానం ప్రాంగణం మారు మ్రోగిపోయింది . పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ… కేటీఆర్ జన్మదినోత్సవం వందలాది మంది ప్రజల మధ్యన జరుపుకోవడం ఆనందంగా ఉందని రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు