తెలంగాణ, 24 జూలై (హి.స.)
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉంచాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ డివిజన్ లో గల ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అవసరాలను ముందస్తుగా అంచనా వేసి సిద్ధంగా ఉంచాలని అన్నారు.
ఎక్కడ కూడా ఎరువుల కొరత వినిపించవద్దని చెప్పారు. నాణ్యమైన ఎరువులను ఉంచాలని, రైతులకు ప్రతి కొనుగోలుకు రిసిప్ట్ ఇవ్వాలని దుకాణదారులకు సూచించారు. రైతుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే రికార్డులను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు