బీసీ రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకంగా ఉంది.. మహేష్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, 24 జూలై (హి.స.) ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో లేడు జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామ
మహేష్ కుమార్ గౌడ్


న్యూఢిల్లీ, 24 జూలై (హి.స.)

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో లేడు జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు.

మేం ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే విన్నారని, కేంద్రంలో పెండింగ్లో ఉన్న బిల్లులపై వారికి వివరించామన్నారు. గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన బిల్లులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీని కోసం రాష్ట్రం పంపిన బిల్లుల ఆమోదానికి కేంద్రంతో పోరాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా సుప్రీం కోర్టు రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించేందుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలని కోరినట్లు తెలిపారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande