లొంగిపోయిన 13 మంది మావోయిస్టులు
భద్రాచలం, 24 జూలై (హి.స.) ఛత్తీస్గడ్ లో ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో 13 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్ జిల్లా ఎస్ పి రాబిన్ సన్ గుడియా ముందు ప్లాటూన్ నెంబర్ 16 కు చెందిన 8 మంది మావోయిస్టులు లొంగిపోగా, వీరిలో నలుగురు మహి
మావోయిస్టులు


భద్రాచలం, 24 జూలై (హి.స.) ఛత్తీస్గడ్ లో ఒకేరోజు రెండు వేర్వేరు

ప్రాంతాల్లో 13 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్ జిల్లా ఎస్ పి రాబిన్ సన్ గుడియా ముందు ప్లాటూన్ నెంబర్ 16 కు చెందిన 8 మంది మావోయిస్టులు లొంగిపోగా, వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ప్లాటూన్ కమాండర్ కమలేష్ ఆధ్వర్యంలో వీరు లొంగిపోగా, వీరిపై రు. 33 లక్షల రివార్డు ఉంది. గురువారం సుక్మా జిల్లా ఎస్ పి కిరణ్ చాహ్న ముందు ఐదుగురు మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వీరిపై ఆరు లక్షల రివార్డ్ ఉండగా... వీరందరు గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో పాల్గొన్నారని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యులు ఇలా స్వచ్చందంగా లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande