ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క.
హైదరాబాద్, 24 జూలై (హి.స.) కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మంత్రి సీతక్క గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అయితే 2021, ఆగస్టు 26న కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్ఈయూఐ నాయకులతో
మంత్రి సీతక్క


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మంత్రి సీతక్క గురువారం నాంపల్లిలోని

ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అయితే 2021, ఆగస్టు 26న కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్ఈయూఐ నాయకులతో కలిసి ఆమె ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్కు చికిత్స అందజేయాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ (CMRF) కింద చెల్లించాలని కోరారు. కానీ, కోవిడ్ సమయంలో గుంపులుగా బయట తిరగొద్దని నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నా.. ఆమరణ దీక్షలో పాల్గొన్నందుకు సీతక్కపై నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు విచారణలో భాగంగా ఇవాళ సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande