పెద్దపల్లి, 24 జూలై (హి.స.)
పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ లోని బాలికల గురుకుల విద్యాలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో మౌలిక వసతులు గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వసతుల గురించి తెలుసుకోవడానికి డైనింగ్ హాల్ ను ఆయన సందర్శించారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. పాఠశాలలో వసతులు, భోజనం,టాయిలెట్లు వంటి తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, భోజన నాణ్యతగా ఉండాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఎక్కడ రాజీ పడవద్దు అని ఆయన సూచించారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని బోధన సిబ్బంది ఆయన దృష్టికి తీసుకురాగా బోర్వెల్ వేయిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
ప్రస్తుత వర్షాకాలంలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నెలలో రెండుసార్లు వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని జరిగిందని లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి డైనింగ్ హాల్ సౌలభ్యంగా లేదని బోధన సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వీలైంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్