యూఏఈ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలి: శ్రీధర్ బాబు
హైదరాబాద్, 24 జూలై (హి.స.) యూఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు, యూఏఈ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. ఈ
శ్రీధర్ బాబు


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

యూఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు, యూఏఈ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో డ్రైపోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఫిన్ టెక్, స్మార్ట్ మొబిలిటీ, క్లెమెట్ టెక్ లకు కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande