ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సంక్షేమం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ, ఖమ్మం. 24 జూలై (హి.స.) ఖమ్మం నగరంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 24 జూలై (హి.స.)

ఖమ్మం నగరంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఉచిత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హాస్టల్ మెస్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల జీవితాల్లో మార్పు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

మూడు డివిజన్ల పరిధిలో 150 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించామని, విడతల వారీగా లబ్ధిదారులకు రూ. 5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏ ఆడబిడ్డ ఇల్లు రాలేదని బాధపడొద్దని, రాబోయే మూడు విడతల్లో మిగిలిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక ఈ మూడు డివిజన్ల పరిధిలో రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు సుమారు రూ. 23 కోట్లు కేటాయించారని మంత్రి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande