కాకినాడ, 24 జూలై (హి.స.)
,‘రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ అందించని సంక్షేమ పథకాలను ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి రూ.13 వేలు వేసిన ఘనత కూడా మాదే. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నాం’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం గత ఏడాదిగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఉచిత బస్సు ప్రయాణానికి అవసరమైన 1,400 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. సుమారు 2,000 ఎలక్ర్టిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి పూర్వవైభవం తెస్తాం’ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ