తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 24 జూలై (హి.స.)
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాదిపాటు కోడి గుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కోడిగుడ్ల సరఫరా టెండర్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ లో ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ వసతి గృహాల నుంచి కోడిగుడ్డుల ఇండెంట్ వివరాలు జిల్లా కలెక్టరేట్ కు సమర్పించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి నేరుగా సప్లయర్ కు అవసరమైన కోడిగుడ్ల ఇండెంట్ ను సమర్పించడం జరుగుతుందని, గత సంవత్సరం అడ్మిషన్లకు అదనముగా 10% విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు