హైదరాబాద్, 24 జూలై (హి.స.)
జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు జీవన్ రెడ్డి గురువారం లేఖ రాశారు.
రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాసుబుక్కులు తనాఖా పెట్టుకోకుండానే బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ జగిత్యాల జిల్లాలో బ్యాంకులు రైతులకు తనాఖ లేకుండా రుణాలు ఇవ్వడంలేదని వాపోయారు. అలాగే పట్టాదారు పాస్ బుక్కులు జారీ చేయబడినటువంటి అసైన్డ్ భూములకు సైతం పంట రుణాళివ్వాలన్నారు.
పట్టాదారు పాస్ బుక్కులు బ్యాంకులో డిపాజిట్ లేకుండా అలాగే పాస్ బుక్కులు కలిగిన ఆసైన్ భూములకు సంబంధించిన రైతులకు పంట రుణలిచ్చేవిధంగా లీడ్ బ్యాంక్ అధికారులు, వివిధ బ్యాంకులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జీవన్ రెడ్డి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్