హైదరాబాద్, 24 జూలై (హి.స.)
ఇటీవల వాకింగ్ చేస్తున్న వారికి
కనిపించిన చిరుత జాడ సీసీ కెమెరాల్లో నమోదయింది. గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామం గ్రేహౌండ్స్ వ్యాస్ నగర్ దగ్గర సోమవారం ఉదయం వాకింగ్ చేస్తున్న వారికి చిరుత కనిపించిందని నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏడు సీసీ కెమెరాలను, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా గురువారం ఉదయం వేసనగర్ గ్రేహౌండ్ సమీపంలో చిరుత ఓ చిన్న రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్