గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సెక్రటరీ రమణ కుమార్
తెలంగాణ, ఖమ్మం. 24 జూలై (హి.స.) రాష్ట్రంలోనే తెలంగాణ జనరల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలంగాణ గురుకుల పాఠశాలల సెక్రటరీ సిహెచ్ రమణ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలోని ఏనుకూరు తెలంగ
సెక్రటరీ రమణ కుమార్


తెలంగాణ, ఖమ్మం. 24 జూలై (హి.స.)

రాష్ట్రంలోనే తెలంగాణ జనరల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలంగాణ గురుకుల పాఠశాలల సెక్రటరీ సిహెచ్ రమణ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలోని ఏనుకూరు తెలంగాణ గురుకుల పాఠశాలను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ లో ప్రత్యేక మెలుకువలు ఇచ్చేందుకు ఉపాధ్యాయులకు సూచించడం తరగతిలో జరిగిందన్నారు. పదో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలలో తెలంగాణ జనరల్ గురుకుల పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారని తెలిపారు.

తెలంగాణ గురుకుల పాఠశాలలో సీట్లకు మంచి డిమాండ్ ఉందని, ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు విద్యాబోధన కల్పించడం జరుగుతుందని, అర్హత కలిగిన ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి, విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు, ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టికమైన ఆహారం అందిస్తూ, వసతి సౌకర్యం కూడా కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే తెలంగాణ గురుకుల పాఠశాలకు గుర్తింపు వచ్చే విధంగా అకాడమిక్ క్యాలెండర్ ఏర్పాటు చేసి, వీక్లీ టెస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande