అమరావతి, 24 జూలై (హి.స.)గోదావరి పోలవరం వద్ద వరద నీటితో ఉరకలేస్తోంది. ఎగువ భద్రాచలం వద్ద వరద పెద్దగా లేకపోయినా ఉపనదులైన శబరి పొంగుతుండడంతో అఖండ గౌతమీ గోదావరిలో వరద నీరు పెరుగుతోంది. పోలవరం కడెమ్మ స్లూయిస్ వద్ద నీటిమట్టం ఆరు మీటర్లు గా నమోదయింది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే ఎగువన 27.900 మీటర్ల నీటిమట్టం నమోదైంది. దిగువ స్పిల్ వే వద్ద 17.920 మీటర్లు వుంది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద 28 మీటర్లు, దిగువ కాఫర్ డాం వద్ద 17.200మీటర్లు ఉంది.
దీంతో ప్రాజక్టు నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 1,84,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో:1,26,118 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో:2,49,486 క్యూసేక్కులు వ్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బరాజ్ వద్ద 13.99 మీటర్ల నీటిమట్టం నమోదయింది. బ్యారేజీ నుండి :2,38,886 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద :20 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతానికి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి