అమరావతి, 25 జూలై (హి.స.)
, ‘ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను అర్హులైన వారందరికీ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ జారీ పద్ధతిని సరళీకృతం చేసింది’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన చేశారు.‘పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భా వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చాం.మొత్తంగా 1,09,155 మంది కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ఆగస్టు నుంచి కొత్తగా వారందరికీ స్పౌజ్ కేటగిరీలో వితంతు పెన్షన్ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.దీనికి ప్రతి నెలా రూ.43.66 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది’ అని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ