అమరావతి, 25 జూలై (హి.స.)
కేంద్ర మజీ మంత్రి అశోక్ గజపతి రాజు రేపు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంతో కలిసి నేడు గోవాకు బయలుదేరారు. అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం ఉండటంతో ఇప్పటికే విజయనగరం టీడీపీ శ్రేణులు గోవాకు చేరుకున్నారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము సోమవారం ఉత్వర్వులు జారీ చేయగా అందులో గోవాకు అశోక్ గజపతి రాజును ఖరారు చేశారు.
అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా 1978లో అశోక్ గజపతి రాజు జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తరవాత ఆ పార్టీలో చేరి ఇప్పటివరకు కొనసాగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి