హైదరాబాద్, 25 జూలై (హి.స.)
రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోనియా గాంధీ రాసిన లేఖ తనకు ఆస్కార్ లాంటిదని రేవంత్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. అందులో ఆమె కేవలం పవర్ పాయింట్ సమావేశానికి తాను హాజరు కాలేనన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించిందని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
సీఎం రేవంత్ అసత్యాలతో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అన్నారు. సీఎం రేవంత్ లాగా బ్యాగులు మోసి రాజకీయాల్లో పైకి రాలేదని, ప్రజాసేవతోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..