ఏపీలో పర్యాజకాభివృద్ధికి కేంద్రం నిధులు
న్యూఢిల్లీ, 25 జూలై (హి.స.) , :ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి గత పదేళ్లలో రూ.కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం, రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్
ఏపీలో పర్యాజకాభివృద్ధికి కేంద్రం నిధులు


న్యూఢిల్లీ, 25 జూలై (హి.స.)

, :ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి గత పదేళ్లలో రూ.కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం, రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాజమహేంద్రవరం- అఖండ గోదావరి, గండికోట వంటి ప్రాజెక్టులకు సాస్కి పథకం కింద రూ.113.75 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇటీవల స్వదేశ్‌ దర్శన్‌ 2.0 పథకం కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ అభివృద్థికి రూ.97.52 కోట్లు మంజూరు చేశామని, అరకు బొర్రా గుహలు, లంబసింగి ప్రాంతాల్లో కూడా బౌద్ధ పర్యాటక ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande