ఇంజనీరింగ్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ ఎపిసెట్ లో మంచి ర్యాంకులు. సాధించిన విద్యార్ధులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి.చూపడం లేదు
అమరావతి, 25 జూలై (హి.స.) అమరావతి: ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్‌ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్, ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు తరలిపోతున్నారు.
ఇంజనీరింగ్ లో ప్రవేశాలకు నిర్వహించిన  ఈ ఎపిసెట్ లో మంచి ర్యాంకులు. సాధించిన విద్యార్ధులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి.చూపడం లేదు


అమరావతి, 25 జూలై (హి.స.) అమరావతి: ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్‌ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్, ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు తరలిపోతున్నారు. ఈఏపీసెట్‌లో 1 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారిలో ఇద్దరు మాత్రమే ఇక్కడ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. 500లోపు ర్యాంకులు వచ్చిన వారిలో 12మంది విద్యార్థులు ఏపీలో ఇంజినీరింగ్‌ విద్య చదివేందుకు మొగ్గుచూపారు. మెరికలు, మంచి ర్యాంకులు సాధించిన పిల్లలు ఐఐటీ, నిట్, బిట్స్‌లాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చేరేందుకు వెళ్లిపోతున్నారు. వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన వారిలో 80 మందే ప్రవేశాలు పొందారు. 10వేల లోపు ర్యాంకులు వచ్చిన వారిలో 5,806(58%)మంది ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఈఏపీసెట్‌ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే 50వేల నుంచి లక్ష మధ్య ర్యాంకులు వచ్చిన విద్యార్థులే ఎక్కువ మంది ప్రవేశాలు పొందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande