గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత
అమరావతి, 25 జూలై (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులతో పాటు.. వాగులు, వంకలకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం (Dowaleswaram) వద్ద గోదావరి (Godavari
గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత


అమరావతి, 25 జూలై (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులతో పాటు.. వాగులు, వంకలకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం (Dowaleswaram) వద్ద గోదావరి (Godavari River)కి వరద ప్రవాహం పెరగడంతో.. నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

మరోవైపు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో లంకగ్రామాల్లోకి వరదనీరు చేరింది. మరో మూడ్రోజులు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande