భారత్, బ్రిటన్ల మధ్య ట్రేడ్ డీల్.. స్వాగతించిన ఆర్బీఐ గవర్నర్
హైదరాబాద్, 25 జూలై (హి.స.) భారత్, బ్రిటన్ ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ 6 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మలహోత్ర స్వాగతించారు. రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం అనేక రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. BFSI సమ్మిట్ కు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చే
ఆర్బీఐ గవర్నర్


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

భారత్, బ్రిటన్ ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ 6 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మలహోత్ర స్వాగతించారు. రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం అనేక రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. BFSI సమ్మిట్ కు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూకేతో జరిగిన ట్రేడ్ డీల్ మాదిరిగానే అమెరికా సహా ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకునేందుకు చర్చలు చేస్తోందన్నారు. అలాగే అమెరికా ఆర్థిక అభివృద్ధికి అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తీసుకుంటోన్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కానీ.. పావెల్ నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande