ఐఏఎస్ శ్రీలక్ష్మి కి షాక్.. రివిజన్ పిటిషన్‌ కొట్టి వేసిన తెలంగాణ హైకోర్టు....
హైదరాబాద్, 25 జూలై (హి.స.) ఓబులాపురం మైనింగ్‌ కేసు లో IAS అధికారిణి శ్రీలక్ష్మి కి ఊహించని షాక్ తగిలింది. కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఇటీవలే ఆమె సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన కోర్టు ఆమె పిటిషన్‌‌ను తోసిపుచ్చింది. దీంత
ఐఏఎస్ శ్రీలక్ష్మిఐఏఎస్ శ్రీలక్ష్మి


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

ఓబులాపురం మైనింగ్‌ కేసు లో IAS అధికారిణి శ్రీలక్ష్మి కి ఊహించని షాక్ తగిలింది. కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఇటీవలే ఆమె సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన కోర్టు ఆమె పిటిషన్‌‌ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు లో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ రెండో సారి ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. కాగా, సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్‌ కపాటియా వాదనలు వినిపించారు. ఓంఎసీకి అక్రమంగా మైనింగ్‌ లీజు అప్పగించారని కోర్టుకు తెలిపారు. ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీలక్ష్మి చొరవతీసుకున్నారని ఆరోపించారు. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి మాత్రమే లీజు మంజూరయ్యేలా చూశారని ధర్మాసనానికి తెలిపారు.

ఆమె అక్రమాలకు పాల్పడ్డారని అనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాధారాలు పరిశీలించాకే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వెలువరించిందని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కేసులో సబితా ఇంద్రారెడ్డి, కృపానందం‌కు ఊరట కల్పించారని.. తనకు కూడా కేసు నుంచి విముక్తి కల్పించాలనుకోవడం సరికాదని, శ్రీలక్ష్మి రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ మేరుకు ఇరు పక్షా వాదనలు విన్న ధర్మాసనం శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande