26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
అమరావతి, 25 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) త్వరలో సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఆరు రోజుల పర్యటనలో సీఎం, ప్రముఖ కంపెనీల ప్రతిని
26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే


అమరావతి, 25 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) త్వరలో సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఆరు రోజుల పర్యటనలో సీఎం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, యాజమాన్యాలతో సమావేశమవుతారు.

దావోస్‌ (Davos)లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (World Economic Forum) సమావేశంలో పాల్గొన్న అనంతరం ఇది చంద్రబాబు రెండో విదేశీ పర్యటన. ‘‘బ్రాండ్‌ ఏపీ’’ని ప్రపంచానికి పరిచయం చేసి, పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానాలు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ దృష్టికోణం, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలను ఆయన విదేశీ పెట్టుబడిదారుల ముందు ఉంచనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande