24 గంటల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !
ఢిల్లీ, 25 జూలై (హి.స.)ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరువర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ ఒడిశా వైపు కదులుతుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు (Heavy to
24 గంటల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !


ఢిల్లీ, 25 జూలై (హి.స.)ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరువర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ ఒడిశా వైపు కదులుతుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, కాకినాడ ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande