ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి.... సైకిల్ బహుమతిగా పొందండి. బండి సంజయ్ ఆఫర్..
హుస్నాబాద్, 26 జూలై (హి.స.) ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్ విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంచి ఆఫర్ ప్రకటించారు. ఇకపై తాను ఎంపీగా ఉన్నంతకాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ
బండి సంజయ్ ఆఫర్..


హుస్నాబాద్, 26 జూలై (హి.స.)

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే

టెన్త్ విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంచి ఆఫర్ ప్రకటించారు. ఇకపై తాను ఎంపీగా ఉన్నంతకాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తానని అన్నారు. మోడీ గిఫ్ట్ పేరిట హుస్నాబాద్ పట్టణంలో 4 వ విడత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి బండి సంజయ్ నేడు హాజరయ్యారు.

హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 680 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రికి కృతజ్ఞతగా బాలికలు ముందస్తుగా రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు విద్య, వైద్య పరంగా ఏదో ఒక మంచి పని చేయాలంటూ ప్రధాని మోడీ చేసిన సూచన మేరకు వారి స్ఫూర్తితోనే ఈ సైకిల్ లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

అతి త్వరలో నర్సరీ నుండి ఆరవ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్ తో కలిసి మోదీ కిట్స్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande