ఉరవకొండ, 27 జూలై (హి.స.)
: తన ఇద్దరి కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి కుటుంబ కలహాలతో తన ఇద్దరు కుమార్తెలు కువిజ్ఞా రెడ్డి (7), చైత్రా రెడ్డి (3)కి విష గుళికలు ఇచ్చాడు. అనంతరం తాను కూడా మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాసేపటికి గుర్తించిన స్థానికులు, కుటుంబసభ్యులు వారిని చికిత్స కోసం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ