సింగపూర్ లో ఏపీ.ముఖ్యమంత్రి పర్యటన
అమరావతి, 27 జూలై (హి.స.) : సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సింగపూర్ సహా స
సింగపూర్ లో ఏపీ.ముఖ్యమంత్రి పర్యటన


అమరావతి, 27 జూలై (హి.స.)

: సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సింగపూర్ సహా సమీపంలోని ఐదు దేశాల్లోని తెలుగు ప్రజలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాక ముందే తెలుగువారితో ఈ ఆడిటోరియం నిండిపోయింది. ప్రధాన ఆడిటోరియం నిండిపోవడంతో.. దానికి అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలోకి వారిని తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande