ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ.3500 కోట్లు
హైదరాబాద్, 27 జూలై (హి.స.)వైసీపీ పాలనలో మద్యం పేరుతో సామాన్య ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) చాగల్లు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు గ్రామసభలో మంత్రి పయ్యావుల కేశవ్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికీ త
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ.3500 కోట్లు


హైదరాబాద్, 27 జూలై (హి.స.)వైసీపీ పాలనలో మద్యం పేరుతో సామాన్య ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) చాగల్లు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు గ్రామసభలో మంత్రి పయ్యావుల కేశవ్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మద్యం స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ సక్రమమేనని.. అక్రమం కాదని స్పష్టం చేశారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌‌లు ఏర్పాటుచేసి వేలకోట్లు జగన్ అండ్ కో దాచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ.3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ స్కామ్ చాలా పెద్దదని ఆరోపించారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande