కడప, 27 జూలై (హి.స.)
జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ