తెలంగాణ, ఆదిలాబాద్. 27 జూలై (హి.స.) బోధ్
మండల కేంద్రంలోని యూరియా
గోదామును ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎలాంటి కొరత లేకుండా చూడాలని సూచించారు. అంతేగాకుండా ఇతర రాష్ట్రాలకు యూరియా తరలిపోకుండా ఉండడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. అనంతరం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు