యాదాద్రి భువనగిరి, 26 జూలై (హి.స.)
బీబీనగర్ ఎయిమ్స్ లో ఎలక్ట్రిక్
వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకున్నట్టు తెలిపారు. వాహనాల ద్వారా ఆస్పత్రి భవనం, ఆయుష్, అకాడమిక్ భవనాల మధ్య సేవలందించనున్నట్టు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు, రోగులు, వైద్య సామగ్రి తరలింపు సౌకర్యం కోసం, భవనాల మధ్య రవాణాకు వాహనాలు ఉపయోగపడతాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తాయన్నారు. శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా ఆస్పత్రి ఆవరణలో వాతావరణాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్