మారుమూల ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అందించడం తమ బాధ్యత.. డోర్నకల్ ఎమ్మెల్యే
మహబూబాబాద్, 26 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నిత్యజీవితానికి అనువుగా ర
డోర్నకల్ ఎమ్మెల్యే


మహబూబాబాద్, 26 జూలై (హి.స.)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నిత్యజీవితానికి అనువుగా రాకపోకలపై ఒత్తిడిని తగ్గించేందుకు మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణ పనులు ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధే తమ లక్ష్యమని, మారుమూల ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అందించడం తమ బాధ్యత అని వారు స్పష్టం చేశారు.ఈ పనులు పూర్తయ్యే సరికి మరిపెడ ప్రజలకు మెరుగైన,సురక్షిత రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తాయని రామచంద్రనాయక్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande