చెన్నై, 28 జూలై (హి.స.) తమిళనాడులో గబ్బిలాల మాంసం తో చికెన్ పకోడీల తయారీ కలకలం రేపుతోంది. సేలం జిల్లా ఓమలూరులో గబ్బిలాల మాంసం సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మాంసాన్ని విక్రయిస్తుండగా, వాటి మాంసంతో చికెన్ పకోడి, చిల్లీ చికెన్ లాంటి వంటకాలను తయారు చేసి అమ్ముతున్నట్టు నిర్దారించారు. ఇదిలా ఉంటే గబ్బిలాల వల్లనే కరోనా వచ్చిందని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో చైనాలో గబ్బిలాల వంటకాలను బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇండియాలో వాటితో వంటకాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..