నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ముంబై, 28 జూలై (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అస్పష్టత, కొన్ని కీలక రంగాల్లోని షేర్లపై అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా బ్యాంకిం
స్టాక్ మార్కెట్


ముంబై, 28 జూలై (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అస్పష్టత, కొన్ని కీలక రంగాల్లోని షేర్లపై అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రియల్టీ రంగాల సూచీలు భారీగా పతనమవడం మార్కెట్ మొత్తాన్ని దిగజార్చింది. ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ (Sensex) 570 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ (Nifty) 24,700 స్థాయిని కోల్పోయింది.డాలరుతో రూపాయి మారకం విలువ 86.66..ఈ ఉదయం 81,299.97 పాయింట్ల వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ప్రారంభ దశలో కొద్దిపాటి పుంజుకోలు కనబరిచింది. కానీ మధ్యాహ్నం తరువాత మార్కెట్ మరింతగా పతనమవుతూ ఇంట్రాడేలో 80,776.44 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరికి 572.07 పాయింట్లు నష్టపోయి 80,891.02 పాయింట్ల వద్ద ముగిసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande